ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ప్ర‌స‌వించిన క‌లెక్ట‌ర్ భార్య

ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెంచాల‌ని ప‌లువురు అధికారులు కొంత మంది రాజ‌కీయ నాయకులు తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతారు. మ‌రి కొంత మంది అధికారులు, రాజ‌కీయ నాయకులు అయితే ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ నే నీరుగార్చేలా వ్య‌వ‌హ‌రిస్తూ త‌మ ప్రయివేటు సంస్థ‌ల‌ను వృద్ధి చేసుకోవ‌డానికి పాటు ప‌డుతారు. అయితే తాజాగా ఒక జిల్లా క‌లెక్ట‌ర్ త‌న భార్య ప్ర‌స‌వాన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి లోనే చేయిండు. దీంతో ఆ కలెక్ట‌ర్ పై ప‌లువురు ప్ర‌శంస జ‌ల్లు కురిపిస్తున్నారు.

ఆ కలెక్ట‌ర్ ఎవ‌రో కాదు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా క‌లెక్ట‌ర్ అనుదీప్ దురిశెట్టి. ప్ర‌భుత్వ ఆస్పత్రుల పై ప్ర‌జల‌కు విశ్వాసం పెంచాల‌నే ఉద్ధేశంతో నే ఇలా చేశాడ‌ని తెలుస్తుంది. అయితే మంగ‌ళ వారం భ‌ద్రాచ‌లం లోని ప్ర‌భుత్వ ప్రాంతీయ ఆస్ప‌త్రిలో క‌లెక్ట‌ర్ అనుదీప్ దురిశెట్టి భార్య చేరింది. ఆమె తాజాగా మ‌గ శిశువుకు జ‌న్మ‌నిచింది. త‌ల్లి బిడ్డ‌లు ఇద్ద‌రూ కూడా క్షేమంగా ఉన్నార‌ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు. అయితే కాగ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు చెందిన అనుదీప్ దురిశెట్టి 2017 లో జ‌రిగిన సివిల్ స‌ర్వీసెస్ ఎగ్జమ్ లో దేశంలోనే మొదటి ర్యాంక్ ను సొంతం చేసుకున్నారు.