సొంత ఇంటి కల నెరవేర్చుకున్న గంగవ్వ.. గృహప్రవేశం ఫోటోలు వైరల్

-

మైవిలేజ్‌ స్టార్, బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ గంగవ్వ గురించి… తెలియని వారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. మై విలేజ్‌ అనే యూట్యూబ్‌ షో తో… గంగవ్వ బాగా ఫేమస్‌ అయింది. దీంతో బిగ్‌ బాస్‌ 4 లో చాన్స్‌ కొట్టేసింది. ఇంకేముంది… వరుసగా సినిమాలు కూడా చేసేస్తుంది గంగవ్వ. అయితే.. గంగవ్వ తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహ ప్రవేశం చేసింది. బిగ్‌ బాస్‌ తెలుగు 4వ సీజన్‌ లో కంటెస్టెంట్‌ గా ఇంట్లో అడుగుపెట్టిన గంగవ్వ.. మద్యలోనే.. బయటకు వచ్చేసింది. అనారోగ్య సమస్య కారణంగా బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి వచ్చేసింది గంగవ్వ.

ఈ సందర్భంగా తన చిరకాల కోరికను హోస్ట్‌ నాగార్జున ముందు పెట్టింది. దీంతో నాగార్జున బిగ్‌ బాస్‌ నుంచి… గంగవ్వ ఇంటి కోసం ఏకంగా రూ.11 లక్షలు ఇప్పించాడు. ఆ డబ్బుతో తన ఇళ్లు పూర్తి చేసుకుంది గంగవ్వ. తాజాగా కొత్త ఇంట్లో గంగవ్వ గృహ ప్రవేశం చేయగా.. ఈ కార్యక్రమానికి బిగ్‌ బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్లు కూడా వచ్చారు. ఇక తన ఇంటి నిర్మాణం కోసం సహాయం చేసిన నాగార్జునకు కృతజ్ఞతలు చెప్పింది గంగవ్వ.

Read more RELATED
Recommended to you

Latest news