పది నెలల్లో అద్బుతాలు జరుగుతాయా..? : సీఎం రేవంత్ రెడ్డి

-

పది నెలల్లో అద్బుతాలు జరుగుతాయా..? అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పది నెలల్లో చేయని పని ఏదైనా ఉందా అన్నారు. ” నేను పని మీద ఫోకస్ పెట్టిన. నేను పని ఆపితే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది నా పని ఆపి ఇటు తిరిగితే అందరి పని చెబుతా” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ యువత ఉద్యమబాట పట్టి రాష్ట్రాన్ని సాధించుకుందని తెలిపారు. స్వాతంత్య్ర భారతంలో ఏడాది వ్యవధిలోనే 50వేల ఉద్యోగాల భర్తీ చేసిన తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించామన్నారు. 

కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పదవులు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే 563 మంది గ్రూపు-1 అధికారులను రాష్ట్ర నిర్మాణంలో భాగం చేయబోతున్నామని చెప్పారు. TGPSC ప్రక్షాళన ప్రభుత్వ పని తనానికి గీటు రాయి అని పేర్కొన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే.. యువత భవిష్యత్ నాశనం అవుతుందని, ఎలాంటి ఆటంకం లేకుండా నియామక ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version