ఇంకో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది : సీఎం రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బోనస్ డబ్బులతో రైతుల కళ్లలో ఆనందం చూసి తనకు బిర్యానీ తిన్నంత ఖుషిగా ఉందన్నారు. సన్న వడ్లకు క్వింటాల్ కి రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రధాని నరేంద్ర మోడీ హామీలు నెరవేర్చలేక పోయారని విమర్శించారు. రైతులను మరిచిన కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారని దుయ్యబట్టారు.

మరోవైపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పదవులు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే 563 మంది గ్రూపు-1 అధికారులను రాష్ట్ర నిర్మాణంలోనే భాగం చేయబోతున్నామని చెప్పారు. TGPSC ప్రక్షాళన ప్రభుత్వ పని తనానికి గీటు రాయి అన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే.. యువత భవిష్యత్ నాశనం అవుతుందని, ఎలాంటి ఆటంకం లేకుండా నియామక ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version