ఈనెల 18 నుంచి హైదరాబాద్ లో వింగ్స్ ఇండియా కార్యక్రమం

-

హైదరాబాద్లో ఈనెల 18వ తేదీ నుంచి వింగ్స్ ఇండియా కార్యక్రమం జరగనుంది. విమాన రంగానికి మరింత ఊతమిచ్చే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం నగరంలోని బేగంపేట విమానాశ్రయం రెడీ అవుతోంది. ఈనెల 21వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలు కనువిందు చేయనున్నాయి.

విమానయానానికి ప్రజలను మరింత చేరువ చేసే ఉద్దేశంతో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ రంగానికి ఉన్న అవకాశాలను వ్యాపారవేత్తలకు, అంకుర పరిశ్రమలకు అవగాహన కల్పించడం కూడా ఈ ప్రదర్శన ఉద్దేశమే. దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన బోయింగ్‌తో పాటు పలు రకాల విమానాలను ఈ షోలో ప్రదర్శించనున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు వాహనాలను మళ్లించనున్నారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎస్ శాంతి కుమారి, జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news