భర్తను కోల్పోయిన ఆ మహిళ తన భర్త జ్ఞాపకంగా ఓ మొక్కను నాటింది. ఆ మొక్కను జాగ్రత్తగా కాపాడుకుంటూ.. అందులో తన భర్తను చూసుకుంటోంది. ప్రతి సంవత్సరం తన భర్త పుట్టినరోజున ఆ మొక్కకు జన్మదిన వేడుకలు నిర్వహిస్తోంది. తాజాగా ఈ విషయం ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దృష్టికి వచ్చింది. ఆయన ఆ మహిళ చేసిన పనిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
ఆత్మీయులను కోల్పోయిన వారిలో కొంతమంది.. వారి జ్ఞాపకంగా మొక్కలు నాటి జాగ్రత్తగా పెంచుతూ సమాజం కోసం ప్రకృతి సేవ చేస్తారని.. అలాంటి వారికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అండగా ఉంటుందని జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. తాండూరు మున్సిపల్ మాజీ అధ్యక్షురాలు కోట్రిక విజయలక్ష్మి భర్త ఆరు సంవత్సరాల క్రితం మరణించగా.. ఆయన జ్ఞాపకాలను కళ్లారా చూసుకోవాలని ఇంటి వద్ద మొక్క నాటారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ.. ఏటా భర్త జయంతి (జులై 29) రోజున ఆ చెట్టుకు బర్త్‌డే వేడుకలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో రోడ్డు విస్తరణలో చెట్టును తొలగించాల్సి రాగా.. ఆమె చెట్టును తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో నాటించారు. తాజాగా జయంతి వేడుకలు జరిపారు. విషయం తెలుసుకున్న ఎంపీ సంతోష్ విజయలక్ష్మితో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు.‘మీఆలోచన అద్భుతం’అంటూ ట్వీట్ చేశారు.
Heartwarming scenes. #KotrikaVijayaLaxmi garu, a strong, determined lady searching for her lost husband amidst the tree he planted on his birthday as part of the #GreenIndiaChallenge initiative. Every year on his birthday, the family celebrates at this tree, showing their… pic.twitter.com/uLccrPcmx8
— Santosh Kumar J (@SantoshKumarBRS) July 30, 2023