తెలంగాణ ఎన్నికలకు కరెక్ట్ గా మూడు నెలల సమయం ఉంది. నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికల సెప్టెంబర్ నుంచే ఎన్నికల సందడి మొదలయ్యే ఛాన్స్ ఉంది. అటు అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చు. మొత్తానికి ఏదైనా గాని ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. అందుకే పార్టీలు అన్నీ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజేపిలు ఎన్నికల స్ట్రాటజీలు అమలు చేయడం మొదలుపెట్టాయి. ఇక మూడో సారి అధికారం చేపట్టాలని చూస్తున్న కేసిఆర్..రాష్ట్రంలో తమ పార్టీకి అనుకూలంగా ఉండేలా రాజకీయం మొదలుపెట్టారు.
అధికారంలో ఉండటంతో ప్రజలని ఆకర్షించేలా కొత్త పథకాలు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. సంక్షేమ, అభివృద్ధి అంశాలపై ప్రజలపై వరాల జల్లు కురిపించవచ్చు. అయితే వరదల వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అందుకే ముందుగా వరద సాయాన్ని ప్రకటించడానికి కేసిఆర్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ సమావేశం జరుగుతుంది. అలాగే ఆగష్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
ఈ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ వేదికగా ఎన్నికలకు ఉపయోగపడేలా ప్రభుత్వ ఘనతలపైన, ప్రతిపక్షాల బలహీనతలపైన కేసిఆర్ ఫోకస్ పెట్టి..ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడానికి సిద్ధమవుతున్నారు. మొదట వరదల వల్ల నష్టపోయిన రైతులని ఆదుకునే కార్యక్రమం చేయవచ్చు. ఇళ్ళు కోల్పోయిన వారికి ఇళ్ళు..దెబ్బతిన్న రోడ్లని అభివృద్ధి చేయడం ఇలా పలు కీలక అంశాలపై ఫోకస్ పెట్టనున్నారు.
అటు 9 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు, వాటి ద్వారా ప్రజలకు జరిగిన లబ్దిపై చర్చ పెట్టే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీలను విమర్శించడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల విద్యుత్ అంశం, అటు పార్లమెంట్ లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేసే అవకాశం..ఇలా ప్రతి అంశంపై అసెంబ్లీలో మాట్లాడి రాజకీయంగా లబ్ది పొందడమే టార్గెట్ గా కేసిఆర్ ముందుకెళ్లే ఛాన్స్ ఉంది.