BREAKING: కర్ణాటకలో ఘోర ప్రమాదంం…లారీ, టెంపో ఢీ.. 13 మంది మృతి

-

13 killed in tragic road accident in Karnataka’s Haveri district:  కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ రోజు అంటే శుక్ర వారం తెల్లవారుజామున గుండెనహళ్లి సమీపంలో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ లారీని టెంపో వెనుక నుంచి ఢీ కొట్టింది.

13 killed in tragic road accident in Karnataka’s Haveri district

ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరంతా సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించగా… వారు కూడా సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news