తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినా నీళ్లు ఇవ్వడానికి ఉందని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నుంచి నీరు తీసుకోకపోయినా పంటలు పండించామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించకండి.. లగచర్లలో జరిగిందంటున్నారు. మరి ఆనాడు మల్లన్న సాగర్ లో జరిగింది ఏంటి అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.

కొండ పోచమ్మ సాగర్ నుంచి మీ ఫామ్ హౌజ్ కు నీరు తీసుకెల్లారా లేదా..? ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌజ్ ల కోసం అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల దగ్గర ఎవ్వరికీ ఫాం హౌజ్ లు ఉన్నాయో నిజనిర్ధారణ కమిటీ వేద్దామా..? అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దుర్మార్గమైన ఆలోచన మీకు ఉంటుంది.. మాకు ఎందుకు ఉ:టుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూమి కోల్పోయినప్పుడు రైతులకు బాధ ఉంటుంది.. లగచర్లలో అసైన్డ్ భూములకు కూడా 20లక్షలు ఇచ్చామని తెలిపారు రేవంత్ రెడ్డి.