కుప్పం లాగే.. టెక్కలిలో వైసీపీ జెండా ఎగరాలి – సీఎం జగన్‌

-

కుప్పం లాగే.. టెక్కలిలో వైసీపీ జెండా ఎగరాలని కార్యకర్తలు, నేతలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. టెక్కలి నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల రూ.1026 కోట్ల రూపాయలు గడపగడపకూ చేర్చగలిగామని… ఎవరెవరికి ఇచ్చామో.. ఆధార్‌ కార్డు వివరాలతో సహా, అక్కచెల్లెమ్మల పేర్లతో సహా చెప్పగలిగేలా ప్రతి ఇంటికీ చేర్చగలిగాని స్ఫష్టం చేశారు.

అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ఎవ్వరూ మిస్‌ కాకుండా, సంతృప్తస్థాయిలో, ప్రతి 50 ఇళ్లకుఒక వాలంటీర్‌ ద్వారా, ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ద్వారా వీటిని చేర్చామని వెల్లడించారు. మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని… ఇవ్వాళ్టి నుంచి అడుగులు కరెక్టుగా పడితేనే.. మనం క్లీన్‌స్వీప్‌ చేయగలుగుతామని చెప్పారు. టెక్కలి నియోజకవర్గంలో భావనపాడు పోర్టు కూడా రాబోతుందని.. సుమారు రూ.4362 కోట్లు కూడా ఖర్చు చేస్తున్నామన్నారు. డిసెంబరులో దీనికి శంకుస్థాపన చేయబోతున్నామని.. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పనులు డిసెంబరులో పునరుద్ధరణ చేయబోతున్నామని స్పష్టం చేశారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news