వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులపై షర్మిల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. శాసన సభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఈమేరకు షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
అయితే నేతల ఫిర్యాదుకు కౌంటర్ గా… వైయస్ షర్మిల కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. తనను మరదలు అన్నారని.. ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు షర్మిల. స్పీకర్ పోచారం గారు.. నాపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని, ఒక తల్లిని మరదలంటు నన్ను కించపరిచి నన్ను, నాతోటి మహిళలను అవమాన పరిచిన సంస్కార హీనుడైన మంత్రి నిరంజన్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాల్సింది గా విజ్ఞప్తి కోరారు వైఎస్ షర్మిల.
స్పీకర్ @PSRTRS గారు.. నాపై చర్యల గురించి ఆలోచించే ముందు.. @TelanganaCMO KCR దొరగారి నోటినుంచి జాలువారిన ఆణిముత్యాలు చూసి విని ఆయనపైన ముందు చర్యలు తీసుకోవలసిందిగా విగ్న్యప్తి. Video Credits @V6News pic.twitter.com/dyrr1dgkqm
— YS Sharmila (@realyssharmila) September 13, 2022