ఒక ఆడమనిషి సిగ్గులేకుండా లిక్కర్ స్కామ్ చేస్తావా ? – కవితపై వైఎస్‌ షర్మిల ఫైర్‌

-

ఒక ఆడమనిషి సిగ్గులేకుండా లిక్కర్ స్కామ్ చేశావంటూ కల్వకుంట్ల కవిత ను ఉద్దేశించి..వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. నేను క్షమాపణ చెప్పాలా ? బాధితురాలు క్షమాపణ చెబుతారా ! ఒక ఆడమనిషి సిగ్గులేకుండా లిక్కర్ స్కామ్ చేస్తారు..ఒక మహిళా పాదయాత్ర చేస్తే అడ్డుకుంటారా ? అని మండిపడ్డారు షర్మిల. తెలంగాణ సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ గుండాల నుంచి నాకు ప్రాణహాని ఉందని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కు వైఎస్సార్ లెగసీ చూసి భయం పడుతుంది.. వైఎస్ షర్మిల పాదయాత్ర… కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర అన్నారు. పోలీసుల భుజం పై గన్ను పెట్టి… మా పాదయాత్ర అపుతున్నారని ఆగ్రహించారు. హై కోర్టు ఆదేశాలు ఉన్నా.. పాదయాత్ర అనుమతి ఇవ్వకుండా షోకాజ్ నోటీసులు ఇచ్చారని.. టీఎస్ పోలీసు డిపార్ట్మెంట్… టిఆర్ఎస్ పోలీస్ గా మారిందని ఆగ్రహించారు. బస్సు తగిలబెట్టింది టిఆర్ఎస్ కార్యకర్తలు.. ఫ్లెక్సీలకు నిప్పు పెట్టింది టిఆర్ఎస్ కార్యకర్తలు అని.. శాంతిభద్రతలకు విఘాతం కల్గించింది టిఆర్ఎస్..అని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version