తెలంగాణ రాష్ట్రంలో రోజుకోచోట ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. కానీ ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. తాజాగా ఇదే విషయంపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.”ఉస్మానియా హాస్టల్ నుంచి ఊర్లో ఉన్న గురుకుల హాస్టల్స్ వరకు ఎక్కడచూసినా పురుగుల అన్నం,ముక్కపట్టిన బియ్యం.కూరల్లో వానపాములు బొద్దింకలు ఎలుకలు.
మొన్న బాసర IIIT లో వందల మంది విద్యార్థులు, నిన్న మహబూబాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 36 మంది విద్యార్థులు, ఇవాళా సిద్ధిపేట సాంఘిక సంక్షేమ హాస్టల్ లో 22 మందికి ఫుడ్ పాయిజన్.సర్కారు భోజనం తిని ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయినా కానీ కండ్లు తెరువలేదు దొర. అయ్యా కేసీఆర్ గారు, కనీసం మా పేద విద్యార్థులకు బుక్కెడు అన్నం పెట్టడం కూడా బరువేనా? చదువుల కోసం పంపిస్తే వాళ్లకు విషపు కూడు పెట్టి చంపేస్తున్నావ్ కదా కేసీఆర్”. అని వైయస్ షర్మిల ట్వీట్ చేశారు.
హాస్టల్ లో 22 మందికి ఫుడ్ పాయిజన్.
సర్కారు భోజనం తిని ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయినా కానీ కండ్లు తెరువలేదు దొర. అయ్యా కేసీఆర్ గారు, కనీసం మా పేద విద్యార్థులకు బుక్కెడు అన్నం పెట్టడం కూడా బరువేనా? చదువుల కోసం పంపిస్తే వాళ్లకు విషపు కూడు పెట్టి చంపేస్తున్నావ్ కదా కేసీఆర్ 2/2— YS Sharmila (@realyssharmila) July 31, 2022