వైఎస్సార్ బ్రతికి ఉంటే తెలంగాణలో ఈ పరిస్థితి ఉండేదా ? అని నిలదీశారు వైఎస్ షర్మిల. దండేపల్లి మండలం కోయ పోష గూడెం పోడు రైతులతో వైఎస్ షర్మిల ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… 2002 నుంచి ఈ పోడు భూములను సాగు చేసుకుంటున్నారని… ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వక పోవడం దారుణమని ఆగ్రహించారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని… వైఎస్సార్ మీ పట్టాలను మీ చేతుల్లో పెట్టే వారన్నారు.
ఈ భూములు మావి అని 52 కుటుంబాలు ప్రతి ఏడాది పోరాటం చేస్తున్నారు… ప్రతి ఏడాది హింసిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ ఇచ్చిన ఇల్లులను వదిలి పేట్టి ఇక్కడే గుడిసెలు వేసుకున్నారని… పోడు పట్టాలు అడిగితే గొడ్డలి తో నరికేస్తరా..? అని ఆగ్రహించారు.
జైల్లో పెట్టి మహిళలను చిత్ర హింసలకు గురి చేశారని… పాలు ఇచ్చే తల్లులను అని కూడా చూడలేదని.. ఆడవారికి కనీసం రక్షణ లేదని కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మనుషులు ఉండే సమాజం అని కూడా సర్కారు కు సోయి లేదని… ముఖ్యమంత్రి ఉండి సచ్చినట్లు సమానం అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని కేసీఅర్ హామీ ఇచ్చారు కదా..? కుర్చీ వేసుకొని కూర్చొని పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.. 8 ఏళ్లుగా ఒక్క ఎకరాకు కూడా పట్టాలు ఇవ్వలేదని మండిపడ్డారు.