హైదరాబాద్ మహా నగరంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని యూసఫ్‌గూడలో ఈ ఘటన జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్‌లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే ‘నాని కార్స్’లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 20 కార్లు దగ్ధమైనట్లు యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం సంభవించిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.
వేసవిలో అగ్నిప్రమాదాలు తరచూ సంభవిస్తూ ఉంటాయని. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. షాపులు మూసివేసే సమయంలో లోపల మండే వస్తువులు ఉంచకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు మొదట మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అగ్నిప్రమాద వారోత్సవాలు నిర్వహించామని చెప్పారు.