నేడు హైదరాబాద్లో జీరో షాడో డే.. మధ్యాహ్నం 12.12 గంటలకు శూన్యనీడ

-

మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా కూర్చున్నా నిల్చున్నా మన నీడ వెన్నంటే ఉంటుంది. ఇక పిల్లలైతే నీడతో కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మన నీడ మాయం అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? అలాంటి అరుదైన సంఘటనే ఇవాళ ఆవిష్కృతం కాబోతోంది. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మన నీడ ‘మాయం’ అవుతుంది! ఇలా ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. దీన్నే జీరో షాడో డే లేదా శూన్య నీడ అంటారు.

ఈ ‘శూన్య నీడ’ రోజు సూర్యుడు సరిగ్గా నడినెత్తిపై ఉంటే నిటారుగా ఉండే మనిషి, జంతువు లేదా వస్తువు నీడ కనిపించదు. హైదరాబాద్‌లో ఈ శూన్యనీడ దినం గురువారం మధ్యాహ్నం 12.12 గంటలకు ప్రారంభమై రెండు, మూడు నిమిషాల వరకూ కొనసాగుతుందని హైదరాబాద్‌లోని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు తెలిపారు. మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే మాత్రం శూన్యనీడ కనిపించే అవకాశం ఉండదని చెప్పారు. ఔత్సాహికులు తమ ఫొటోలను [email protected] కు పంపించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news