అసెంబ్లీలో 650 పేజీల కాళేశ్వరం కమిషన్‌పై చర్చ పెట్టండి.. చీల్చి చెండాడుతామన్నారు హరీష్ రావు. శాసనసభ వేదికగా నిజాలు ప్రజలకు తెలిసేలా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు హరీష్ రావు. కాళేశ్వరం పై తెలంగాణ భవన్‌లో వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ నిజమైతే.. ఆ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టినట్టు అని వెల్లడించారు. ఎందుకంటే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం అని పేర్కొన్నారు హరీష్ రావు.

ఇదే గోదావరి నది మీద కట్టిన పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు కూలిపోతే NDSA అక్కడికి ఒక్కసారి కూడా పోలేదని వెల్లడించారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ మీద మాత్రం పిలవకుండానే NDSA వచ్చి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందు మూడు సార్లు రిపోర్టులు ఇచ్చిందన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు మళ్ళీ కాళేశ్వరం కమిషన్ అని ఈ ప్రభుత్వం రాజకీయ కుట్రలకు పాల్పడుతుందని చెప్పారు. కేసీఆర్‌కు, నాకు నోటీసులు రాకున్నా, రేవంత్ రెడ్డి మీడియాకు లీకులు ఇచ్చి మమ్మల్ని కమిషన్ పిలిచింది అని మీడియాలో రాయించాడు అన్నారు హరీష్ రావు.