తెలంగాణలో క్షుద్ర పూజలు కలకలం.. .డబ్బులు వర్షంలా కురుస్తాయని ఆశ చూపి యువతిని !

-

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఈ క్షుద్రపూజల ముఠా పోలీసుల అదుపులో ఉందని అంటున్నారు. 20 లక్షలు, బంగారం ఆశ చూపి దివ్య అనే యువతిని ముఠా కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది. పోలీసుల విచారణలో సరికొత్త ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్షుద్రపూజల వెనుక మహరాష్ట్ర పూజారి హస్తం ఉందని అంటున్నారు. బారిష్ పేరిట పూజలు చేస్తే…డబ్బులు వర్షంలా కురుస్తాయని మహారాష్ట్ర గ్యాంగ్ ఆశ చూపింది.

మహిళలతో పూజలు చేస్తే… డబ్బులు వర్షం కురుస్తాయనే నమ్మకంతో దివ్య అనే యువతిని క్షుద్రపూజల ముఠా ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. రాజేందర్, కుమార్ ప్రధాన సూత్రధారులు కాగా మల్లమ్మ, సరితలకు కూడా ఇందులో హస్తం ఉందని గుర్తించారు. పోలీసుల అదుపులో మహారాష్ట్ర పూజారితో పాటు నలుగురు నిందితులు ఉన్నట్టు చెబుతున్నారు. బారిష్ పూజ అనేది మోసం అని పోలీసులు చెబుతున్నారు. బారిష్ లా నిధులు కురిసేందుకి ఓ సెట్ ఏర్పాటు చేసి…రసాయనాలతో వర్షం కురిసేలా ఏర్పాటు చేస్తారని, రసాయనాల కలయికతో వర్షం తో పాటు డబ్బులు కురిసేలా చేసి అమాయకుల నుంచి ఈ గ్యాంగ్ లక్షల రూపాయల మేర దోపిడీ చేస్తున్నట్టు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version