వెనకబడిన తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు : మాజీ మంత్రి హరీశ్ రావు

-

తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ వృద్ధి జీరోకు పడిపోయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. దేశవ్యాప్తంగా సగటు జీఎస్టీ వృద్ధి రేటు 10% ఉండగా, తెలంగాణ దేశీయ వృద్ధి రేటుతో పోలిస్తే చాలా వెనకబడి ఉందన్నారు. ఇటీవల ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

‘జీఎస్టీ వృద్ధి 12.3%గా ఉందని అసెంబ్లీలో భట్టి ప్రకటించడం శోచనీయం’ అని హరీశ్ రావు అన్నారు.అధికారిక గణాంకాలను పరిశీలిస్తే భట్టి విక్రమార్క వాదనలు పూర్తిగా అవాస్తవమైనవని తేలిపోయిందన్నారు. ‘బడ్జెట్ సమావేశాల్లో నేను ఈ విషయాన్ని ప్రస్తావించి, రాష్ట్ర జీఎస్టీ వృద్ధి రేటు 5.5%కు పరిమితమవుతుందని హెచ్చరించాను.మా సలహాలు,హెచ్చరికలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు’ అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వృద్ధి రేటు కేవలం 5.1% మాత్రమేనని చెప్పారు.కొవిడ్-19 లాక్‌డౌన్ టైంలో మినహా ఎప్పుడూ ఇంత తక్కువ వృద్ధి నమోదు కాలేదని హరీశ్ రావు విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news