అమెరికాలో మ‌రో చంద్ర‌బాబు..!

-

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌రో చంద్ర‌బాబు ఉన్నారా ? అనే రేంజ్‌లో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. ఏపీలో గ‌త ఏడాది ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు అప్ప‌టి అధికార పార్టీ టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు.. ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కుడు వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ ఓ అరాచ‌క‌వాది.. ఆయ‌న‌కు ఓటేస్తే.. రాష్ట్రాన్ని అగ్నిగుండంలోకి నెట్టిన‌ట్టే.. అని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, వైఎస్సార్ సీపీ నేత‌ల‌ను కూడా రౌడీలుగా, పులివెందుల ఫ్యాక్ష‌నిస్టులుగా పేర్కొన్నారు. ఇలాంటి వారిని గెలిపిస్తే.. ప్ర‌జ‌ల ఆస్తుల‌ను కూడా దోచేస్తార‌ని ప్ర‌చారం నిర్వ‌హించారు.

Elections in the United States
అయితే, ప్ర‌జ‌లు ఏం చేశారో తెలిసిందే. ఇక, ఇప్పుడు ఇలాంటి ప్ర‌చార‌మే.. అమెరికాలోనూ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అక్క‌డ అధికారంలో ఉన్న రిప‌బ్లిక‌న్ పార్టీ నాయ‌కుడు, రెండో సారి కూడా అధ్య‌క్ష పీఠం రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కూడా చంద్ర‌బాబు మాదిరిగానే అక్క‌డి ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డుతున్నారు. అయితే, ఆయ‌న‌కు నిజానికి ప్ర‌త్య‌ర్థిపై విమ‌ర్శ‌లు చేసేందుకు ప్ర‌త్యేకంగా ఏమీ లేవు. గ‌తంలో 2016లో అయితే.. ప్ర‌త్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లుచేశారు. ఆమెను చూస్తే.. ఆమె భ‌ర్త‌కు మూడ్ ఎలా వ‌స్తుందో కూడా అర్ధం కావ‌డం లేద‌న్నారు.

ఇక‌, ఇప్పుడు ప్ర‌త్య‌ర్థిగా ఉన్న జోబైడెన్‌పై మ‌రో రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అమెరికా స్వప్నాలను జో బైడెన్‌ నాశనం చేస్తారని, రానున్న ఎన్నికల్లో బైడెన్‌ గెలిస్తే అమెరికా స్వప్నాలకు ప్రమాదమని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. డెమొక్రాట్లకు అధికారమిస్తే అరాచకవాదులకు స్వేచ్ఛనివ్వడమేనని ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా గొప్పతనాన్ని జో బైడెన్‌ ధ్వంసం చేయడం ఖాయమని రిపబ్లికన్‌ సమావేశంలో ప్రత్యర్థి జో బైడెన్‌‌పై ట్రంప్‌ విరుచుకుపడ్డారు.

అమెరికా వైట్‌ హౌస్‌లోని సౌత్‌ లాన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ అభ్యర్థిత్వాన్ని స్వీకరించిన సందర్భంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడంతో అమెరికాలోని మెజార్టీ తెలుగు వారు .. మ‌న చంద్ర‌బాబును ట్రంప్‌ మించిపోయారే అని స‌టైర్లు పేలుస్తున్నార‌ట‌. వాస్త‌వంగా చూస్తే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని స‌ర్వేల్లోనూ ట్రంప్ బైడెన్‌తో పోలిస్తే వెన‌క‌ప‌డ్డారు. దీంతో ఆయ‌న నోటికి ప‌ని చెపుతున్నార‌నే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version