Manu Charitra: అంచనాలు పెంచేసేలా.. మ‌ను చ‌రిత్ర లిరికల్ సాంగ్

-

Manu Charitra: ఇంట్రెస్టింగ్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న చిత్రం మ‌ను చరిత్ర. ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా న‌టిస్తుండ‌గా..మేఘా ఆకాశ్ ఫీమేల్‌ లీడ్ రోల్ పోషిస్తోంది. చూసీ చూడంగానే సినిమాతో టాలీవుడ్ కు శివ కందుకూరి ప‌రిచయ‌మ్యాడు. త‌న న‌ట‌న‌తో మెప్పించారు. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ ప‌తాకంపై నార‌ల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు.

భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. రాన్సన్ జోసెఫ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. దీంతో చిత్ర ప్ర‌మోష‌న్ ను వేగ‌వంతం చేస్తున్నారు మూవీ యూనిట్. ఇప్పటికే విడుదలైన ఫ‌స్ట్ లూక్, టీజర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.

తాజాగా మ‌రో పాటను రిలీజ్ చేశారు. క్లాస్ మాస్ తో పాటు అన్ని వర్గాలకు ప్రేక్ష‌కుల‌ను నచ్చేలా.. ఈ పాట ఉంది. “కనబడకనే తెగ తిరుగుతు నను వెతికిన తుంసే మేరా ప్యార్ హువా..పద పదమని నీవెనుకనే నను కదిపిన దిల్ సే మేరా ప్యార్ హువా“ అంటూ సాగే ఈ సాంగ్ .. మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఎంత‌గానో అల‌రిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో నిత్యామీనన్, శ్రియ, ప్రియాంక జవాల్కర్ నటిస్తున్నారు. ఈ లిరిక‌ల్స్ తో సినిమాపై అంచాలు పెరిగాయి. హీరో శివ కూడా ఈ సినిమా మీద‌నే హోప్స్ పెట్టుకున్న‌ట్టు తెలుస్తుంది.

https://youtu.be/zScre544jfk

Read more RELATED
Recommended to you

Latest news