Anushka48 Announcement : బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేసిన అనుష్క

-

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అంద చందాలు మరియు నటనతో కూడా ఆకట్టుకుంటోంది ఈ అందాల తార. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనుష్క.. అప్పటి నుంచి తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఇవాళ అనుష్క శెట్టి 40 వ పుట్టినరోజు.

ఈ నేపథ్యంలోనే తన 48వ చిత్రాన్ని ప్రకటించింది అనుష్క. ఈ మేరకు యు.వి.క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు మహేష్ బాబు.పి డైరెక్షన్ లో లో అనుష్క 48వ చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా యు వి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటికే అనుష్క రెండు సినిమాలు చేసింది. మొదట మిర్చి ఆ తర్వాత భాగమతి సినిమాలు చేసింది అనుష్క. ఇక తాజాగా తన 48వ చిత్రం కూడా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై చేస్తోంది అనుష్క. ఇక ఈ తాజా అప్డేట్ తో అనుష్క ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news