నల్లజాతీయుడు కావడం వల్లనే టెంబా బవుమాకు కెప్టెన్సీ ఇచ్చారా ?

-

ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో అద్భుతంగా రాణించి సెమి ఫైనల్ కు చేరుకుంది సౌత్ ఆఫ్రికా జట్టు. ఈ విజయాలకు ముఖ్య కారణం డి కాక్, డస్సెన్, మార్ క్రామ్, క్లాసేన్ లు అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ కెప్టెన్ గా ఉన్న టెంబా బావుమా మాత్రం బ్యాట్ తో రాణించింది లేదు. అన్ని జాట్క్ల కెప్టెన్ ల కన్నా బావుమా చాలా దారుణమైన ప్రదర్శన చేశాడని చెప్పాలి. వరుసగా బ్యాటింగ్ లో విఫలం అవుతున్న బవుమాకు జట్టు కు కెప్టెన్ గా ఎందుకు నియమించారన్న ప్రశ్న చాలా మందిలో వచ్చి ఉంటుంది. ఇందుకు ఒక కారణం ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అదేంటంటే.. నల్లజాతీయులు కోటాలో బావుమా కు కెప్టెన్ గా ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు.

కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇందులో వాస్తవం లేదట… 2021 లో కెప్టెన్ గా డి కాక్ తప్పుకోవడంతో సౌత్ ఆఫ్రికా లో సంక్షోభం ఏర్పడింది.. అప్పుడు బావుమా ఒక్కడే ముందుకొచ్చి నేను తీసుకుంటాను కెప్టెన్సీ అంటూ దైర్యం చేశాడట. ఆలా బావుమా నల్లజాతీయులలో మొదటి కెప్టెన్ గా పేరు తెచుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news