మాధవి లత నిరసన…పాత బస్తీలో ఉద్రిక్త వాతావరణం

-

తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాలకు ఈ రోజు(మే 13)న పోలింగ్ జరిగింది. కాగా రాష్ట్రంలో ఉన్న 16 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే రాష్ట్ర రాజధానిలోని పాత బస్తీ ఎన్నికల ఫైటింగ్ మరో ఎత్తు అన్నట్లు ఉంది.గత 40 ఏళ్లుగా నామమాత్రపు ఎన్నికగనే హైదరాబాద్ లో ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ ఈ సారి బీజేపీ ఆ నియోజకవర్గం నుంచి మాధవీ లతను అభ్యర్థిగా ప్రకటించడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. సామాజీక వెత్తగా పేరుగాంచిన ఆమె.. హైదరాబాద్ ఎంపీ సీటును గెలిచేందుకు తీవ్రంగా కృషి చేశారు.

ఇదిలా ఉంటే.. పోలింగ్ ముగిసిన తర్వాత మాధవీ లత నిరసనకు దిగారు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రియాసత్ నగర్‌,జమాల్ కాలనీలోని పోలింగ్ బూత్‌లో కొందరు వ్యక్తులు ఎన్నికల రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కాగా, 2024 లోక్ సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు(మే 13) మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.దేశవ్యాప్తంగా 62.31 శాతం పోలింగ్ నమోదైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version