యాలుకలతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్‌ పెట్టేయొచ్చు..!

-

ఉరుకుల పరుగుల జీవితం..వారం అంతా కష్టపడితే కానీ రానీ వీక్‌ ఆఫ్..నెల జీతం కోసం నెలరోజులు ఎదురుచూపు.. ఒక పక్క ఆఫీస్‌ ఒత్తిడి ఇంకోపక్క ఫ్యామిలీ ప్రజర్‌.. ఏదో ఒకటి ఆ టైమ్‌కు తిన్నామా..చాలు. వ్యాయామం చేసే టైమ్‌ ఇంక ఎక్కడ ఉంటుంది. ఫలితంగా అధిక బరువు సమస్య వచ్చేస్తుంది. బరువు తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో మనం ఎంచుకునేదాన్ని బట్టి.. రిజల్ట్‌ ఉంటుంది. బెల్లీ ఫ్యాట్‌ తగ్గించుకోవడానికి యాలుకలు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.

యాలకులతో బెల్లీ ఫ్యాట్..

ఏలకులు బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. యాలకుల్లో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి. రోజూ ఆహారంలో చేర్చుకుంటే పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు సహజంగా కరిగిపోతుంది. ఈ సుగంధద్రవ్యాలను సాధారణంగా కూరలు, పరాటాలు, స్వీట్లలో ఉపయోగిస్తారు. కొంతమంది ఏలకులను పాలు, టీలో కలుపుతారు. ఇంకా మసాలా టీలో కూడా ఉపయోగిస్తారు.

కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది..

ఏలకులు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దీని వల్ల కడుపు సమస్యలు కూడా దూరమవుతాయి. అసిడిటీ, మలబద్ధకం, కడుపులో మంట, గ్యాస్ వంటివి తగ్గుతాయి. జీర్ణశక్తి పెరగడం వల్ల, కొవ్వు కరుగుతుంది..దీంతో క్రమంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు చిన్న ఏలకులను పచ్చిగా తింటే.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

యాలుకలతో నోటి దుర్వాసన కూడా పోతుంది. రోజూ భోజనం చేసిన తర్వాత.. ఒక యాలుక నోట్లో వేసుకుని బుగ్గన పెట్టుకుంటే నోటినుంచి మంచి వాసన వస్తుంది. గ్యాస్‌ టాబ్లెట్‌ కూడా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.

యాలుకలతో కొవ్వు కరుగుతుందని సైంటిఫిక్‌గా కూడా నిరూపించారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు.. యాలుకలను డైలీ డైట్‌లో వాడుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news