రేపటి నుంచి తెలంగాణలో పదోతరగతి పరీక్షలు

-

తెలంగాణలో రేపటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 04వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,547 పాఠశాలల నుంచి 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో అబ్బాయిలు 2,58,895 కాగా.. అమ్మాయిలు 2,50,508 మంది ఉన్నారు. ఈ మేరకు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది.

ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేశారు. అలాగే విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని.. పకడ్బందీగా పరీక్షలను నిర్వహించడం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 040-23230942 నెంబర్ కు సంప్రదించాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష జరిగే సమయంలో చుట్టూ పక్కల జీరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news