ఇకపై బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ ఉత్సవాలు : హైడ్రా కమిషనర్

-

ఇకపై బతుకమ్మ ఉత్సవాలు బతుకమ్మ కుంటలోనే జరుగుతాయని, వచ్చే బతుకమ్మ నాటికి ఆ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.అంబర్ పేట మండలం బాగ్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులకు కలిగిన ఆటంకాలు మంగళవారం సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో పరిష్కారమైందన్నారు.

ఈ క్రమంలోనే బుధవారం హైడ్రా కమిషనర్ బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను ప్రారంభించారు.స్థానికుల సమక్షంలో బతుకమ్మ కుంట అభివృద్ధి పనులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. కోర్టు వివాదం పరిష్కారం అయినందున యుద్ధ ప్రాతిప‌దిక‌న చెరువు పున‌రుద్ధర‌ణ‌, అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేపట్టాలని అధికారుల‌ను ఆదేశించారు.వచ్చే బతుకమ్మ పండుగ నాటికి పనులు పూర్తవుతాయని, ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు ఇక్కడే జరుగుతాయని తెలిపారు. చెరువు అభివృద్ధి ప‌నుల‌కు స్థానికులు స‌హ‌క‌రించాల‌న్నారు.అభివృద్ధి ప‌నుల‌కు పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని స్థానికులు క‌మిష‌న‌ర్‌కు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news