తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పేపర్-1 ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 2 లక్షల 50 వేల మందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. అయితే పేపర్-1కు సంబంధించిన కీని సబ్జెక్టు నిపుణుల చేత రూపొందించారు. ఈ కీని అభ్యర్థుల అవగాహన కోసమే విడుదల చేస్తున్నట్లు సబ్జెక్టు నిపుణులు పేర్కొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసే కీనే ఫైనల్ అవుతుందన్నారు.
నేడు జరిగిన టెట్ పేపర్-1 గత టెట్లతో పోలిస్తే చాలా ఈజీగా వచ్చిందని పలువురు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో గత టెట్లలో క్వాలిఫై కానీ అభ్యర్థులకు డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేందుకు వారిని దృష్టిలో పెట్టుకుని పేపర్ ఇచ్చినట్టు అభ్యర్థులు తెలిపారు. అయితే గతం కంటే దాదాపు లక్ష దరఖాస్తులు ఈసారి తక్కువగా వచ్చాయి. ఇందుకు గల ప్రధాన కారణం..ఎస్సీ నోటిఫికేషన్ వెలువడకపోవడం వల్లనేనని తెలుస్తోంది. అప్లై చేసినా.. వారిలో బీఈడీ వారికి ఎస్జీజీ అవకాశం ఇవ్వకపోవడంతో పేపర్-1కు రాసేందుకు వారు అనాసక్తి చూపారు.