గురుకులాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

-

సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశాల కోసం మే 8వ తేదీన నిర్వహించిన టీజీసెట్‌–22 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల విద్యా సంస్థల పనితీరుపై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ మొత్తం నాలుగు సొసైటీల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం వీటీజీసీఈటీ 2022 నిర్వహించారు. ఫ‌లితాల కోసం https://tgcet.cgg.gov.in/ అనే వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

మొత్తం 48,440 సీట్లకు గాను లక్షా 47 వేల 924 మంది బాలబాలికలు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1.38 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయడంతోపాటు, అందుబాటులో ఉన్న సీట్లకు సంబంధించి కేటగిరీల వారీగా అర్హులైన విద్యార్థుల జాబితాను మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ అర్హత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version