దేశం దివాలా తీసింది కాంగ్రెస్ పాలనలోనే : తమ్మినేని

-

దేశంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రమాదకరంగా మారుతోంది. తెలంగాణలోనూ బీజేపీ ప్రమాదకరంగా మారుతుంది అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గత అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కి వచ్చిన ఓట్లే నిదర్శనం. ఎక్కడైనా చిన్న గొడవ జరిగిన దాన్ని రాద్ధాంతం చేసి లబ్దిపొందాలని బీజేపీ చూస్తుంది. ఎర్రజెండా చరిత్రని తిరగరాయడానికి బీజేపీ కుట్ర చేస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందు-ముస్లిం తగాదా దినంగా మార్చడానికి కుట్ర చేస్తుంది అని అన్నారు. అయితే ఈ మహాసభల్లో బీజేపీ కుట్రలను తిప్పి కొడతాం.మాతో ఏ పార్టీ కలిసి వచ్చినా సరే కలుపుకుని బీజేపీ పని చెబుతాం.

ఇక దేశం దివాలా తీసింది కాంగ్రెస్ పాలనలోనే. బీజేపీ లాంటి మహా రాక్షసుని ఎదుర్కోవాలంటే చిన్న దెయ్యాన్ని వెంట పెట్టుకున్నాం. ఓడ దాటేవరకు ఓడ మల్లయ్య..ఓడ దాటాక బోడ మల్లయ్య అన్నట్టు కాంగ్రెస్ తీరు ఉంది. హైడ్రా, మూసి, లగచర్ల, దామగుండం గురించి అందరితో సీఎం మాట్లాడారా.. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్న ఎర్రజెండా ఎప్పుడు ప్రజల పక్షం అని తమ్మినేని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news