అదో సంప్రదాయం.. శ్మశానంలో దీపావళి వేడుకలు

-

దేశ ప్రజలు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా నిన్న రాత్రి నుంచే కొందరు దీపావళి సంబురాలను మొదలెట్టారు. దీపావళి వేడుకలు ఎక్కవగా ఇంటి వద్ద లేక షాపుల వద్ద ఎక్కువగా నిర్వహిస్తుంటారు. టపాసులు కాలుస్తూ కేరింతలు కొడుతారు. కానీ, కరీంనగర్‌లోని ఓ ప్రాంత వాసులు అందుకు భిన్నంగా ప్రతీఏటా శ్మశాన వాటికలో దీపావళి వేడుకలు జరుపుకుంటుంటారు. జిల్లాలోని కార్ఖానా గడ్డలో ఉన్న హిందూ స్మశాన వాటికలో కొన్ని దళిత కుటుంబాలు శ్మశాన వాటికలోనే దీపావళి వేడుకలను జరుపుకుంటూ వస్తున్నారు.

చనిపోయిన తమ పెద్దలను గుర్తు చేసుకుంటూ సమాధుల మధ్య వేడుకలు జరుపుకుంటారు. పండుగకు వారం రోజుల ముందే తమ కుటుంబ పెద్దల సమాధులను శుభ్రం చేసి,పూలతో అలంకరిస్తారు. అనంతరం సాయంత్రం కుటుంబ సభ్యులంతా అక్కడే టపాసులు కాలుస్తారు.ఈ సంప్రదాయం గత 6 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుందని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన సెలబ్రేషన్ వీడియోలు నెట్టింట తాజాగా చక్కర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news