CM Chandrababu will visit Srikakulam district tomorrow : సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖరారు అయింది. రేపు సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటించనున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు విశాఖ విమానాశ్రయంలో ఆగనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖపట్నానికి సీఎం చంద్రబాబు వెళతారు. విశాఖ నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకుళం జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం లో ఉచిత సిలిండర్ డెలివరీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, విజయవాడ వెళతారని పార్టీ వర్గాల సమాచారం. దీనిపై అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కాగా.. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సిలిండర్ డెలివరీ కార్యక్రమం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.