టీడీపీ వర్సెస్ జనసేన..ఆ స్థానాల్లో ట్విస్ట్‌లు!

-

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్నాయనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది..కానీ ఈ సారి ఆ పరిస్తితి రానివ్వకూడదు అని అటు చంద్రబాబు, ఇటు పవన్ భావిస్తున్నారు. అందుకే ఇద్దరు నేతలు పొత్తు దిశగా వెళుతున్నారు. అయితే పొత్తు అధికారికంగా సెట్ అవ్వాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంది. జనసేన డిమాండ్లకు టి‌డి‌పి ఒప్పుకోవాలి..ఇటు టి‌డి‌పి డిమాండ్లు జనసేన ఒప్పుకోవాలి.

అప్పుడే రెండు పార్టీల మధ్య పొత్తు సెట్ అవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ సీట్లలో టి‌డి‌పికి బలం ఉంది..బలమైన నాయకులు ఉన్నారు. జనసేనకు ఆ పరిస్తితి లేదు. అందుకే జనసేనకు సీట్లు ఇవ్వాలంటే టి‌డి‌పి నేతలే త్యాగం చేయాలి. కానీ కీలకమైన సీట్లలో టి‌డి‌పి నేతలు త్యాగాలు చేసేలా లేరు. పైగా టి‌డి‌పి అధిష్టానం సైతం కొన్ని సీట్లని జనసేనకు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు కనిపించడం లేదు. కొన్ని సీట్లలో టి‌డి‌పికి గెలుపు అవకాశాలు ఉన్నాయి.

అలాంటి సీట్లని జనసేనకు ఇవ్వాలని టి‌డి‌పి భావించడం లేదు. అందుకే కొన్ని సీట్లలో టి‌డి‌పి-జనసేనల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఉదాహరణకు తాడేపల్లిగూడెం సీటు ఉంది..ఆ సీటులో టి‌డి‌పి స్ట్రాంగ్, జనసేన స్ట్రాంగ్. దీంతో ఎవరికి వారే సీటు పై పట్టు వదలడం లేదు. ఇటు తిరుపతి సీటుపై జనసేన ఆశలు పెట్టుకుంది. 2009లో ఇక్కడ చిరంజీవి గెలిచారు. అందుకే ఈ సీటు తమకే ఇవ్వాలని కోరుతుంది.

కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి కేవలం 800 ఓట్ల తేడాతోనే ఓడింది. దీంతో ఈ సీటు వదులుకోవడానికి టి‌డి‌పి రెడీగా లేదు. ఇలా కొన్ని సీట్లలో టి‌డి‌పి-జనసేనల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version