రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలుపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరు అని అన్నారు. ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి అని హితవు పలికారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే భారీ లిక్కర్ కుంభకోణం జరిగింది.
లిక్కర్ వ్యాపారులను బెదిరించి కమీషన్లు దండుకున్నారని పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షిలాంటివారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవటమే ఎంపీ లావు పని అని.. ఆయనకు కూడా భయపడతామా? అని ప్రశ్నించారు. జగన్ పై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదు అని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు.