ఆ సాంకేతికతను అభివృద్ధి చేస్తే రూ.730 కోట్లు ఇస్తారట..!

-

కర్బన ఉద్గారాల కారణంగా భూతాపం ప్రతి ఏటా పెరుగుతూ మానవ మనుగడకు సవాల్‌గా మారుతోంది. ఈ క్రమంలో వాతవరణంలో ఉద్గారాలను తగ్గించేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. కొందరు మాత్రం ఇందులో కాస్త పురోగతి సాధించారు. కానీ.. సమర్థవంతమైన సాంకేతిక మాత్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ కంపెనీ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మాస్క్‌ రంగంలోకి దిగి అసా«ధ్యాలను సుసాధ్యం చేసేవైపు అడుగులు వేస్తున్నాడు.

ప్రపంచంలో అపర కుబేరుడిగా అవతరించిన మాస్క్‌ కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అభివృద్ధి చేసే çపనిలో పాటు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరైతే అలాంటి సాంకేతికతను అభివృద్ధి చేస్తారో వారిని పోత్సహించాలని శ్రీకారం చుట్టి వారికి ఊహించని రీతిలో ప్రైజ్‌మనీ ప్రకటించాడు. దీంతో పోటీ పెరిగి వీలైనంత త్వరగా మెరుగైన సాంకేతికత అందుబాటులోకి తీసుకు వచ్చేందకు కృషి చేయాలని నిర్ణయించి అలాంటి సాంకేతికత అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్‌ డాలర్లు అనగా దాదాపుగా రూ.730 కోట్లు ప్రైజ్‌మనీగా ఇస్తానని ట్వీటర్‌ ద్వారా ప్రకటించాడు.

జోబైడెన్‌ సైతం..

జుకర్‌బర్గ్, బిల్‌గేట్స్, జెఫ్‌బెజోస్‌ లాంటి దిగ్గజాలతో పోలిస్తే మాస్క్‌ దాతృత్వ కార్యక్రమాల్లో వెనకబడ్డారనే విమర్శలు ఉన్నావి. ఈ క్రమంలో మాస్క్‌ నుంచి ఇలాంటి ప్రకటన రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా మాస్క్‌ భారీ విరాళాలు అందజేశారు. వాటితో పోలిస్తే తాజాగా ప్రకటించిర విరాళం పది రేట్లు ఎక్కువగా ఉంది.ఇటీవల అమెరికా పీటం అధిష్టించిన జోబైడెన్‌ సైతం కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news