మీరు సోల్ మేట్సా? అసలు సోల్ మేట్స్ కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి..

-

ప్రేమలో పడ్డ తర్వాత చేతులు పట్టుకుని పార్కుల చుట్టూ తిరగడం, భుజాల మీద చేతులు వేసుకుని, ఒకే పాప్ కార్న్ ని షేర్ చేసుకుని సినిమా చూడడం. ఇంట్లో చెప్పకుండా పెళ్ళి చేసుకోవడం మొదలగునవన్నీ ప్రేమించిన తర్వాత కలగవచ్చు. ఐతే మీ పార్ట్ నర్ మీకు సరైన జోడీ అని మీరెలా నిర్ధారించుకున్నారు? మీ సోల్ కి సరైన మేట్ అతనే లేదా ఆమే అని ఎలా కనుక్కున్నారు. దానికేమైనా లెక్కలున్నాయా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం కొత్తగా కనిపిస్తుంది. కళ్ళకి రంగుల అద్దాలు తగిలించుకుంటారు. అందుకే అంతా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఆ అద్దాలున్నప్పుడే సోల్ మేట్ దొరికారంటూ సంబరపడతారు. ఎంత త్వరగా ఆ అద్దాలు తీస్తారో అంత త్వరగా నిజం తెలుసుకుంటారు. మీ సోల్ మేట్ నిజంగా సోల్ మేటేనా లేదా భ్రమలో ఉన్నారా అన్నది తెలుసుకోవచ్చు.

మీ సోల్ మేట్ దొరికినపుడు మీకనిపించే లక్షణాలు..

అతనే లేదా ఆమే మీ సోల్ మేట్ అని తెలిసిపోతుంది.
వాళ్ళేం మాట్లాడకుండానే వాళ్ళ మనసులో ఏముందో తెలిసిపోతుంది.
వాళ్ళ బాధ మీకర్థం అవుతుంది. వాళ్ళు చెప్పకపోయినా సరే.
వారితో ఉన్నప్పుడు మీతో ఉన్నట్టే అనిపిస్తుంది. ముఖానికి రంగేసుకోవడం, మిమ్మల్ని మీరు పెద్దగా పట్టించుకోవడం చేయరు.
మీతో మీ ప్రైవేట్ స్పేస్ లో ఎలా ఉంటారో వారితోనూ అలాగే ఉంటారు.
మీ కన్నీళ్ళు అర్థం చేసుకుంటారని బలంగా నమ్ముతారు.
మీ స్వేఛ్ఛని హరించరని మీకు బాగా తెలుసు. అందుకే ఏ విషయమైనా చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు.

Read more RELATED
Recommended to you

Latest news