150 ఏళ్ల సినీ వృక్షం నేలకు ఒరిగింది..!

-

సాధారణంగా మన  కళ్ల ముందు ఉన్న చెట్టు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలితే మనకు ఏదో కోల్పోయినట్టు తప్పకుండా అనిపిస్తుంది. అలాంటిది ఓ సినిమా చెట్టు కూలిపోతే మరేలా ఉంటుందో ఊహించడం కష్టం అనే చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉండేది సినిమా చెట్టు.

తాజాగా ఈ చెట్టు కుప్ప కూలిపోయింది. 1975లో రిలీజ్ అయిన పాడిపంటలు సినిమా నుంచి రంగస్థలం వరకు ఆ చెట్టు ఓ ఐకాన్ సింబల్. మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు.. ఇలా అనేక సినిమాల్లో కనిపించింది ఆ చెట్టు. దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్. 150 సంవత్సరాల వయస్సున్న ఈ చెట్టు చుట్టూ దాదాపు 300 సినిమాల షూటింగ్‌లు జరగడం విశేషం. దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారంట. అంతటి పేరున్న ఈ చెట్టు కూలిపోయింది. దీంతో స్థానికులు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version