SBI హైదరాబాద్ బ్రాంచ్ ఫ్రాడ్ కేసులో నేరస్థుడిని CBI అరెస్ట్ చేసింది. బ్యాంకులను మోసం చేసి బాబాగా అవతారం ఎత్తాడు చలపతిరావు. రాజస్థాన్ లో విదితామానంద తీర్థ స్వామీజీగా అవతారం ఎత్తిన చలపతిరావు… వినీత్ కుమార్ గా చలామణి అవుతున్నాడు. అయితే SBI బ్యాంకు మోసం కేసులో పరారీలో ఉన్న వి. చలపతి రావును అరెస్టు చేసారు. నిందితుడు ఎస్‌బిఐని కోట్లు మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.
తమిళనాడు రాజస్థాన్ బీహార్ మధ్యప్రదేశ్లో బాబాగా తిరుగుతున్న చలపతిరావు.. తన పేరు, తన ఇద్దరు భార్యల పేర్లతోపాటు ఈమెయిల్స్ సెల్ ఫోన్ నెంబర్ మార్చి బాబాగా అవతారం ఎత్తాడు. 2004 నుండి కనిపించకుండా పారిపోయిన చలపతిరావు.. 7 సంవత్సరాలు తర్వాత చనిపోయినట్లుగా భార్య కోర్టులో పిటిషన్ వేసింది. తన భర్త పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం తన పేరు మీద బదిలీ చేయాలని పిటిషన్ లో పేర్కొంది. భార్య పిటిషన్తో విచారణను ప్రారంభించిన CBI అధికారులు.. తమిళనాడులోని ఒక గ్రామం నుండి బాబా అలియాస్ చలపతిని అరెస్ట్ చేసిన చేసారు.