కొన్ని కొన్ని హత్యలు, ఘోరాలు చూస్తుంటే మనస్సును కలిచివేస్తుంది. ఇలాంటి ఘటనే ఫ్లోరిడాలో జరిగింది. ఓ 14ఏళ్ల కుర్రాడు 13ఏళ్ల అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఏకంగా 114సార్లు పొడిచి చంపాడు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా స్పందించింది.
మే 9 న సెయింట్ జాన్స్ కౌంటీ షెరీఫ్ ఆఫీసులో ట్రిస్టిన్ బెయిలీ అనే 13ఏళ్ల అమ్మాయి కనిపించట్లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఓ చెరువు సమీపంలో ఆమె మృతి చెంది కనిపించింది. అయితే ఆమెను 14 ఐడెన్ ఫుసి అత్యంత దారుణంగా పొడిచి చంపినట్టు తేలింది.
దీంతో ఈ కేసును బాల్య నుండి వయోజన కోర్టుకు తరలించినట్లు స్టేట్ అటార్నీ ఆర్. జె. లారిజా తెలిపారు. క్రూరమైన హత్యగా దీన్ని పరిగణించి, నిందితుడిని వయోజనుడిగా గుర్తిస్తూ శిక్షించాలని నిర్ణయం తీసుకున్నట్లు లార్జా వివరించారు. ఇలా ఓ మనర్‌ను తాను చేసిన అత్యంత దారుణమైన హత్యను దృష్టిలో ఉంచుకుని అతన్ని వయోజనుడిగా గుర్తిస్తూ శిక్షించడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు. ఇక దీనిపై ట్రిస్టిన్ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.