కట్నం సరిపోలేదని పీటల మీద పెళ్లి ఆపేసిన వధువు..! మీరు విన్నది నిజమే..!

-

ఆడపిల్ల పెళ్లంటే..పొలాలు, బంగారాలు ఏదో ఒకటి అమ్మితే కానీ.. కట్నాలు ఇవ్వలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఎంతో కష్టపడి కట్నం పోగేసినా.. తీరా పెళ్లి టైమ్‌ వచ్చేసరికి.. మళ్లీ ఎంతో కొంత అదనపు కట్నం అడుగుతారు.. ఇస్తారా లేక పీటల మీద పెళ్లి ఆపేయమంటారా అని కండీషన్‌ పెడతారు. అలాంటిది.. ఓ వధువు తనకు అదనపు కట్నం కావాలని మరికొద్ది క్షణాల్లో జరగాల్సిన పెళ్లిని ఆపేసింది. వరుడే అమ్మాయి వాళ్లకు కట్నం కింద రెండు లక్షలు ఇచ్చాడట.. కానీ ఆమె ఏం చేసిందంటే..

హైదారాబాద్‌ శివారు ప్రాంతమైన ఘట్‌కేసర్‌లో ఈ విచిత్రమైన సంఘటన జరిగింగి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతికి పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. కట్నం కింద అమ్మాయి వాళ్లు అబ్బాయికి ఇవ్వకుండా ..పెళ్లి కొడుకు తల్లిదండ్రులే వధువుకు రెండు లక్షలు కట్నం ఇచ్చి నిశ్చితార్ధం చేసుకున్నారట.. వివాహం గురువారంరాత్రి 7.20నిమిషాలకు జరగాల్సి ఉండగా ..పెళ్లి కూతురు కట్నం సరిపోలేదంటూ పెళ్లి కొడుకు తల్లిదండ్రులను అదనపు కట్నం కోసం డిమాండ్ చేసింది. వాళ్లు ఇవ్వకపోవడంతో పెళ్లి రద్దు చేసుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

ప్లేట్‌ మార్చిన పెళ్లికూతురు..

వరకట్నం సరిపోలేదని పెళ్లి కొడుకు వివాహం రద్దు చేసుకోవడం మీరు చాలానే చూసి ఉంటారు. మొదటిసారి ఏమో..ఇలా జరగటం…పెళ్లికూతురే కట్నం సరిపోలేదని వివాహం క్యాన్సిల్‌ చేసేసింది..ఈనెల 9వ తేది రాత్రి ఓ ఫంక్షన్‌ హాలులో వివాహ ఏర్పాట్లు చేసారు. అయితే ముహుర్తం సమయానికి అమ్మాయి తరఫు బంధువులు ఎవరూ కనిపించకపోవడంతో వరుడి కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే రెండు లక్షల కట్నం సరిపోదని..మరికొంత కావాలని డిమాండ్ చేసారు. వరుడి తరపు బంధువులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికి యువతి బంధువులు తగ్గకపోవడంతో వివాహం కాస్తా ఆగిపోయింది.

అదనపు కట్నం ఇస్తేనే పీటలపై పెళ్లి జరుగుతుందని అమ్మాయి తెగేసి చెప్పడంతో వరుడి తల్లిదండ్రులు అందుకు ససేమిరా అన్నారు.. దీంతో ముహుర్తానికి గంట ముందే పెళ్లి ఆగిపోయింది. ఈ వ్యవహారంలో పోలీసులు కలగచేసుకున్నప్పటికీ ఏం ప్రయోజనం లేకపోయింది. అంతే కాదు ముందుగా పెళ్లి కూతురుకి ఇచ్చిన 2లక్షల కట్నం డబ్బులు కూడా తిరిగి వెనక్కి ఇవ్వలేదు అమ్మాయి కుటుంబ సభ్యులు. పెళ్లి తర్వాత ఈ సంఘటన జరిగితే డబ్బుతో పాటు పరువు కూడా పోయేదని పెళ్లి కొడుకు బంధువులు, కుటుంబ సభ్యులు అంతటితో సరిపెట్టుకున్నారు.

అయినా.. రెండు లక్షలు ఎదురిచ్చి పెళ్లి చేసుకోవడమే గొప్ప విషయం.. మళ్లీ ఇలా చేయడం అమ్మాయి బంధువులకు తగునా అని నెటిజన్లు అంటున్నారు. అయినా ఇక్కడ ఇంకో పాయింట్‌ ఏంటంటే.. సాధారణంగా పీటల మీద పెళ్లి ఆగిపోతే..ఆ అమ్మాయికి ఇంకా జీవితంలో పెళ్లి కాదని అనుకుంటారు..కానీ అమ్మాయి ఈ విధమైన కారణంతో పెళ్లి ఆపేసింది.. ఆమె ధైర్యానికి చెప్పుకోవాలి.. రోజులు మారాయి..పెళ్లి కొడుకులే కాదు.. పెళ్లి కూతుర్లు కూడా ఇలా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version