బెంగళూరులో మంగళవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న ఓ భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తొలుత ఒకరు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న సాయంకాలం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం మరో నలుగురి మృతదేహాలను శిథిలాల గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఈస్ట్ బెంగళూరులోని బాబుసప్లయా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే.
తొలుత 17 మంది శిథిలాల కింద చిక్కుకుపోగా..సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది 14 మందిని రక్షించారు.ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగానే ఏడు అంతస్తుల భవనం కూలిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. కాగా, బిల్డింగ్ కూలిపోయిన సమయంలో దానికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. భవనం కూలిన టైంలో దాదాపు 20 మంది కార్మికులు అందులో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.