వివాహ వేడుకకు వెళ్లి రచ్చ రచ్చ చేసిన ఎద్దు.. వీడియో వైరల్..!!

-

ఇండియాలో పెళ్లిళ్లు అంటే.. ఏదో ఒక రచ్చ జరగాల్సిందే.. మండపంలోనో, భోజనాల దగ్గరో..మగపెళ్లి వాళ్లకు, ఆడపెళ్లి వాళ్లకు ఎక్కడో ఒక దగ్గర తేడాలొస్తాయి. కొన్నిసార్లు ఈ గొడవలు ముదిరి పెళ్లి ఆగేవరకూ వెళ్తుంది. అయితే ఇక్కడ రచ్చ అయింది. మగపెళ్లి వాళ్ల కాదు.. ఒక ఎద్దు వల్ల.. భోజనాలు జరుగుతున్న ప్రదేశంలోకి వచ్చిన ఎద్దు రచ్చ రచ్చ చేసింది. దాన్ని చూసి అందరూ భయడిపోయారు. ఎక్కడ ఏం జరిగినా నెట్టింట తెలిసిపోతుంది. ఇక ఈ ఘటనను కూడా అక్కడున్న ఎవరో వీడియో తీసేశారు.. సోషల్‌ మీడియాలో మంచి మ్యూజిక్‌ వేసి పోస్ట్‌ చేశారు. ఇంకేంముంది ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.
ఓ వివాహ వేదిక వద్ద ఎద్దు ‘గేట్ ఢీకొట్టడం’ వీడియోలో కనిపిస్తుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫుడ్ అండ్ డ్రింక్ స్టాల్స్‌తో నిండిన పెళ్లి విందులో.. బ్లాక్ బుల్ రేసింగ్‌తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. దాన్ని చూసి అక్కడ ఉన్న అతిథులు అంతా..షాక్‌ అయ్యారు. ఆ ఎద్దు అంత మందిని చూసే అది బంబెలెత్తిపోయి పిచ్చి పిచ్చిగా పరుగులు తీసింది.. ఇంతలో, అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఎద్దు వైపు చేతులు ఊపుతూ దానిని మరొక వైపుకు మళ్లించడం చూడవచ్చు. ఎద్దు పారిపోవడానికి బదులు ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ ప్రాంతం నుంచి ఎద్దు దూసుకెళ్లడంతో హాజరైన వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వీడియోకు ఇప్పటి వరకూ 70 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. వీడియో చూసిన తర్వాత, నెటిజన్లు ఆశ్చర్యపోయారు వారి స్పందనలు కామెంట్ సెక్షన్‌ను నింపాయి. “బుల్ ముజే బులాయా నహీ నా లాగా ఉంది, లో ఆ గయా మై” అని ఒక నెటిజన్‌ కమెంట్‌ చేశారు.. “సబ్ కి హాలత్ ఖరాబ్ హోగయి బిన్ బులాయే బారాతీ కో దేఖ్ కర్” అని మరొక వినియోగదారు రాశారు. మొత్తానికి పిలవని పెళ్లికి వచ్చి ఆ ఎద్దు ఆగం ఆగం చేసింది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version