ఫార్ములా ఈ రేసింగ్ లో సినీ రాజకీయ ప్రముఖుల సందడి..

-

భాగ్యనగరంలో జరుగుతున్న ఫార్ములా ఈ రేసింగ్ ను చూసేందుకు ఎందరో సినీ క్రీడా ప్రముఖులు తరలివచ్చారు.. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ రేసింగ్ లో ప్రపంచస్థాయి రేసర్లు తమ ప్రదర్శనతో అదరగొట్టారు..హైదరాబాద్ నెక్లెస్‌ రోడ్‌ వేదికగా ప్రతిష్ఠాత్మక ఫార్ములా- ఈ ప్రపంచ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌ ముగిసింది. భారత్‌లో తొలిసారి హైదరాబాద్‌ వేదికగా జరిగిన రేసింగ్‌లో ప్రపంచస్థాయి రేసర్లు అదరగొట్టారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది. ఈ ఫార్ములా-ఈ రేసింగ్‌ను చూసేందుకు సినీ, క్రీడా ప్రముఖులు తరలివచ్చారు. సచిన్‌, శిఖర్‌ ధవన్‌, చాహల్ తోపాటు అక్కినేని నాగార్జున, దీపక్ చాహర్, పుల్లెల గోపీచంద్, రామ్‌చరణ్‌, నాగచైతన్య, అఖిల్, సిద్దు, బ్రాహ్మణి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి తదితరులు హుస్సేన్‌సాగర్ తీరానికి విచ్చేశారు.

అలాగే ఈ ఫార్ములా-ఈ రేస్‌ లో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా జీన్‌ ఎరిక్‌ వెర్గ్‌నే నిలిచాడు. ఆ తర్వాత రెండో స్థానంలో నిక్‌ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్‌ బ్యూమి ఉన్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. అయితే జీన్‌ ఎరిక్‌ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా- ఈ ఛాంపియన్‌ కావడం విశేషం. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్‌గా అవతరించాడు. అలాగే హుసేన్‌సాగర్‌ తీరంలో దాదాపు 3 కిలోమీటర్ల నిడివితో ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్‌పై మొత్తం 11 జట్లు, 22 మంది రేసర్లు పాల్గొన్నారు అలాగే తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్‌3 కార్లతో రేసర్లు దుమ్ములేపారు. అయితే ఈ రేసింగ్ గా విదేశీ కంపెనీలు రాసారులేదే హవా కొనసాగుగా భారత్ నుంచి మహేంద్ర రేసింగ్ టిసిఎస్ జాగ్వర్ కూడా తమదైన శైలిలో పోటీ ఇచ్చి అలరించాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version