ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. మంత్రి శ్రీధర్ బాబు ఏం చేశారంటే?

-

నగరంలో ప్రతీరోజు ఏదో ఓ చోట ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.కొందరు వాహనదారుల అజాగ్రత్త అందుకు కారణమైతే మరికొందరి ర్యాష్ డ్రైవింగ్.. మైనర్ల డ్రైవింగ్ కూడా అందుకు కారణం అవుతోంది. కొందరు వాహనం నడిపేటప్పుడు చేసే చిన్నచిన్న తప్పుల ద్వారానూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్‌తో పాటు కొందరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు.

తాజాగా నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఓ కారు అదుపుతప్పింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి వస్తున్న కారు అంబేద్కర్ కూడలి వద్దకు రాగానే అదుపు తప్పి ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.ఈ క్రమంలోనే సెక్రటేరియట్ వైపు వెళ్తున్న రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తన వాహనం ఆపి దిగి స్వయంగా ట్రాఫిక్‌ను చక్కదిద్దారు.అనంతరం స్థానిక పోలీసులకు ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version