ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరో షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నివాసాలు, కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థ సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంక్ మోసం కేసులో ఆర్‌కామ్, అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

గతంలో మనీలాండరింగ్ కేసులో భాగంగా 2020లో అంబానీ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ప్రజాధనాన్ని స్వాహా చేశారని ఈడీ ప్రాథమిక దర్యాప్తు పేర్కొంది.