కూటమి మంత్రి రాసలీలలు.. అంటూ వైసీపీ నేత భూమన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి రాసలీలల గురించి టీవీ డిబెట్ లో సాక్షాత్తూ టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి బయటపెట్టారని గుర్తు చేసారు భూమన కరుణాకర్ రెడ్డి. పెద్ద హోటల్స్ లో దిగే ఆ మంత్రి తాగి తందనాలు ఆడేవారన్నారు.

తనను నమ్ముకుంటే పదవులు వస్తాయని ప్రలోభాలకు గురిచేసి మహిళలను లొంగదీసుకునేవారన్నారు. గతంలోనూ హైదరాబాద్ లో ఆ మంత్రి రాసలీల గురించి వార్తలు వచ్చాయని ఆరోపణలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. ఆ మంత్రి ఎవరో టీడీపీ, జనసేన నేతలకు స్పష్టంగా తెలుసు అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.