నేడు కీలక వ్యక్తులను విచారించనున్న సిబిఐ

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు కీలక వ్యక్తులను విచారించి అవకాశాలు ఉన్నాయి. నిన్న వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని విచారించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఆయన పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. నేడు మరోసారి వైఎస్ వివేకా కుమార్తె సునీత విచారించే అవకాశం ఉంది. సునీత ఇప్పటికే కొందరి పేర్లను సిబిఐ అధికారులకు ఇచ్చిన సంగతి విదితమే నేడు.

బిజెపి నేత ఆదినారాయణ రెడ్డి తో పాటుగా టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడా విచారించే అవకాశం ఉంది, అదే విధంగా మరి కొందరు అనుమానితులను కూడా సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైలు లో ఉన్న గెస్ట్ హౌస్ కి పిలిచి విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ కేసుకి సంబంధించి ఇంకా ఎటువంటి సాక్ష్యాలను సిబిఐ అధికారులు సేకరించలేదు.