కరోనా వైరస్ తీవ్రత దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువగా ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు పడుతుంది. ఢిల్లీలో కరోనా కేసులు కట్టడికి అమిత్ షా సమీక్ష కూడా చేసారు. ఇక ఢిల్లీలో కరోనా కట్టడి విధులను నిర్వహించడానికి 45 మంది వైద్యులు మరియు 160 మంది పారామెడిక్స్ ఢిల్లీ చేరుకోగా రైల్వేలు 800 పడకలతో కూడిన కోచ్ లను ఢిల్లీలోని ఒక రైల్వే స్టేషన్ లో కేర్-కమ్-ఐసోలేషన్ సౌకర్యాలుగా ఉపయోగించుకుంటుంది అని కేంద్రం చెప్పింది.
వచ్చే 3 నుంచి 4 రోజుల్లో 35 బిపాప్ పడకలను సిద్దంగా ఉంచుతామని చెప్పింది. ప్రస్తుతం ఉన్న 250 ఐసియు పడకల కోసం 250 అదనపు ఐసియు పడకలను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) చేర్చబోతోందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) తెలిపింది. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో 12 నిర్ణయాలు తీసుకున్నారు.