మహిళలపై దాడులలో ఏపీ నెంబర్.1 అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు. అసలు సృష్టే లేదన్నారు. తల్లిగా, సోదరిగా, భార్యగా, కూతురుగా జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడిని నడిపించేది మహిళ అన్నారు.

స్త్రీ ఎక్కడ గౌరవం పొందుతుందో ఆ ఇల్లు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. ఇవ్వాళ దేశంలో, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆగ్రహించారు. మహిళలు అంటే బీజేపీకి కనీస గౌరవం లేదని మండిపడ్డారు. ఓటు బ్యాంక్ కోసం మహిళలను సెకండ్ క్లాస్ సిటిజన్ కింద బీజేపీ లెక్కగట్టిందని పేర్కొన్నారు. వికసిత భారత్ లో గంటకు 50 మందిపై భౌతిక దాడులు, రోజుకి 80 మందిపై లైంగిక వేదింపులు జరగడం అత్యంత శోచనీయం అంటూ ఆగ్రహించారు. పేరుకే నారీశక్తి వందన్ అదినియమ్ అని ఫైర్ అయ్యారు. ఆచరణలో మహిళలను నగ్నంగా ఊరేగించిన చరిత్ర బీజేపీది తన అనుబంధ సంఘాలదని మండిపడ్డారు.