ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏ రేంజిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు ఉన్న రాష్ట్రంగా మొన్నటి వరకు ఢిల్లీ ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఢిల్లీలో అమాంతం తగ్గిపోయింది. కానీ సెప్టెంబర్ నెల నుంచి మాత్రం మరోసారి ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరించారు.
ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ మొదలయింది అంటూ తెలిపిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ హెచ్చరించారు. ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా మాస్కు ధరించాలని… భౌతిక దూరం పాటించడంతో పాటు శానిటైజర్ కూడా వాడుతూ ఉండాలి అంటూ సూచించారు. కాగా ఇటీవలే అత్యధికంగా ఢిల్లీ రాష్ట్రంలో ఒకేరోజు 4,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.